Wednesday, January 23, 2019
Tuesday, January 22, 2019
Saturday, January 12, 2019
ప్రార్ధన, నూనెలతో రోగాలు మాఫీ అనే పాస్టర్లూ...! దుకాణం సర్దేస్తారా?
కీళ్లనొప్పులు వేధిస్తున్నా.. నమ్మిన దైవం యేసుక్రీస్తు తన బాధలు తొలగిస్తాడని విశ్వసించింది. 20ఏళ్లుగా చికిత్స తీసుకోకుండా జీస్‌సపైనే భారంవేసి కాలం వెళ్లదీస్తోంది. వ్యాధి ముదరడంతో ఆస్పత్రికి తీసుకెళ్లినా చికిత్సకు సహకరించలేదు. దేవుని పట్ల ఆమె పెంచుకున్న ప్రగాఢమైన నమ్మకాన్ని గుర్తించిన డాక్టర్ తానే జీస్‌స అనిచెప్పి చికిత్స అందిస్తున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం కొత్తపాడుకు చెందిన పుల్లగూర మరియమ్మ(55) క్రీస్తుని నమ్మి నిత్యం ప్రార్థనా మందిరానికి వెళుతుంది. ఆమె 20ఏళ్లుగా కీళ్లవాతంతో బాధపడుతోంది. వ్యాధి తీవ్రతతో మోకాళ్లు, మోచేతులు బిగుసుకుపోవడంతో.. భర్త బాలశౌరి ఆమెను జీజీహెచ్‌కు తరలించారు. అక్కడా ఆమె చికిత్సకు నిరాకరించింది. విషయం తెలుసుకున్న న్యూరాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గాజుల రామకృష్ణ ఆమె వద్దకెళ్లి ‘మరియమ్మా లే.. నేను నీ యేసును వచ్చాను! నీ భక్తికి మెచ్చి ఈ డాక్టర్ రూపంలో చికిత్స చేసేందుకు వచ్చాను. బుద్ధిగా మందులు వేసుకో..’ అంటూ ఆమె చెవిలో చెప్పారు. ఇంకేముంది.. తనకోసం ఏకంగా జీసస్ వచ్చాడని భావించిన బాధితురాలు చక్కగా చికిత్సకు సహకరిస్తోంది. కాగా, న్యూరాలజీ విభాగాధిపతి ఎన్వీ సుందరాచారి నేతృత్వంలో రామకృష్ణ, పీజీ విద్యార్థిని మైత్రి ఆమెకు పరీక్షలు చేయించి కీళ్లవాతం తీవ్రస్థాయిలో ఉందని నిర్ధారించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ‘మరియమ్మకు కీళ్లు, ఎముకలు బిగుసుకుపోవడంతో ఆపరేషన్ చేసి కదలికలు తేలికచేసేందుకు ఆర్థోపెడిక్ వార్డుకు తరలిస్తాం’ అని రామకృష్ణ తెలిపారు.
Tuesday, January 8, 2019
బాబోయ్....! ఈళ్ళేశాలూ...
సాపేక్ష సిద్ధాంతం.. e=mc^2.. కాంతి విద్యుత్తు ప్రభావం.. ఇలా ఎన్నో ప్రతిపాదనలకు, ఆవిష్కరణలకు మూల పురుషుడు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్. ఓ విధంగా చెప్పుకోవాలంటే ఆయన వల్లే భౌతిక శాస్త్రం కొత్త పుంతలు తొక్కింది. కానీ, ఆయన సిద్ధాంతాలు తప్పుల తడకగా ఉన్నాయని అంటున్నారు కొందరు భారత శాస్త్రవేత్తలు. ఇక, న్యూటన్ కూడా గురుత్వ వికర్షణ శక్తులను అర్థం చేసుకోవడంలో దారుణంగా విఫలమయ్యాడని వాదిస్తున్నారు. 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వేదికగా పలువురు భారత శాస్త్రవేత్తలు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి. దక్షిణ భారత్‌కు చెందిన ఓ వర్సిటీ అధ్యాపకుడు మూలకణ పరిశోధనను వేల ఏళ్ల క్రితమే ప్రాచీన హిందువులు కనుగొన్నారని, పరిశోధనలు చేశారని చెబుతూ అందుకు ఓ హిందూ గ్రంథాన్ని రుజువుగా పేర్కొన్నారు.
ఆంధ్రా వర్సిటీ వైస్ చాన్సలర్ జీ.నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ రామాయణంలో 24 రకాల విమానాల తయారీ పద్ధతులు ఉన్నాయని, దానికి సంబంధించిన నెట్‌వర్క్ ల్యాండింగ్ స్ర్టిప్స్ శ్రీలంకలో ఉన్నాయని చెప్పారు. తమిళనాడుకు చెందిన ఓ వర్సిటీ అధ్యాపకుడు డాక్టర్ కేజే కృష్ణన్ మాట్లాడుతూ న్యూటన్, ఐన్‌స్టీన్ ఇద్దరి సిద్ధాంతాలూ తప్పేనని, గురుత్వాకర్షణ తరంగాలకు నరేంద్ర మోదీ తరంగాలు అని పేరు పెట్టాలని అన్నారు. ఐన్‌స్టీన్ సిద్ధాంతాలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయని, న్యూటన్ గరుత్వ వికర్షణ శక్తులను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాడని తెలిపారు. కాగా, ఈ శాస్త్రవేత్తల అభిప్రాయాలపై భారత సైంటిఫిక్ కాంగ్రెస్ అసోసియేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆ వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమని, వాటి నుంచి తాము దూరంగా ఉంటున్నట్లు పేర్కొంది.
Sunday, January 6, 2019
Monday, December 17, 2018
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ చెప్పిన చెప్పిన "రాముడు సీతనెందుకు వదిలేశాడు?"
రాముడు సీతమ్మ తల్లిని రాజు కాకముందు పెళ్ళి చేసుకున్నాడు. అప్పడి రాముడు రాజకుమారుడు అంతే. యుద్ధం తరువాత సీత అగ్నిపునీత అని లోకానికి చాటి పట్టాభిషేకం చేసుకున్నాడు. ఒకనాడు మంత్రులలో ప్రభువుకు నీతి పాఠం చెప్పే మంత్రి వచ్చి రాముడు ఏకాంతలో ఉండగా,
“ప్రభూ! మీరు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు. లోకానికి ధర్మం నేర్పడానికి రామచంద్రమూర్తిగా వచ్చి నరుడిగా ఈ భూమిపై నడుస్తున్నారు. ఇటువంటి మీరు ప్రభువు కాకముందు సీతమ్మనుభార్యగా ఉంచుకున్నారు. ధర్మానికి తప్పులేదు. ప్రభువయ్యాక సీతమ్మ భార్యగా ఉండవచ్చా?” అని అడిగారు.
“ఎందుకుండకూడదు?” అని అడిగారు రాములవారు. అందుకు మంత్రి, “ప్రభువు భూమిపతి. అంటే ఈ భూమికి భర్త. మరి అప్పుడు భూమాత తనయ సీతమ్మ మీకు ఏమవుతుంది? మీరు రాజారాముడయ్యాక మీరు ఏకపత్నీవ్రతుడు కాబట్టి భూమికి మాత్రమే భర్తగా ఉండాలి. మరి ఇప్పుడు ధర్మం నిలిచిందా?” అని అడిగాడు. ఉలిక్కిపడిన రాముడు, కారణం చెప్తూ ధర్మం కోసమే సీతమ్మను అడవికి పంపించాడు.
Taken from:
http://smarana-bharathi.blogspot.com/2018/07/blog-post_2.html?showComment=1544978679540#c3610222458266036807
“ప్రభూ! మీరు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు. లోకానికి ధర్మం నేర్పడానికి రామచంద్రమూర్తిగా వచ్చి నరుడిగా ఈ భూమిపై నడుస్తున్నారు. ఇటువంటి మీరు ప్రభువు కాకముందు సీతమ్మనుభార్యగా ఉంచుకున్నారు. ధర్మానికి తప్పులేదు. ప్రభువయ్యాక సీతమ్మ భార్యగా ఉండవచ్చా?” అని అడిగారు.
“ఎందుకుండకూడదు?” అని అడిగారు రాములవారు. అందుకు మంత్రి, “ప్రభువు భూమిపతి. అంటే ఈ భూమికి భర్త. మరి అప్పుడు భూమాత తనయ సీతమ్మ మీకు ఏమవుతుంది? మీరు రాజారాముడయ్యాక మీరు ఏకపత్నీవ్రతుడు కాబట్టి భూమికి మాత్రమే భర్తగా ఉండాలి. మరి ఇప్పుడు ధర్మం నిలిచిందా?” అని అడిగాడు. ఉలిక్కిపడిన రాముడు, కారణం చెప్తూ ధర్మం కోసమే సీతమ్మను అడవికి పంపించాడు.
Taken from:
http://smarana-bharathi.blogspot.com/2018/07/blog-post_2.html?showComment=1544978679540#c3610222458266036807
Subscribe to:
Posts (Atom)
