Tuesday, February 26, 2019

చచ్చేది మనం కాదుకదా.... ఎన్ని యుద్దాలైనా కోరుకుంటాం.....


‘జీ న్యూస్‌’ చర్చాగోష్టిలో పాల్గొన్న 1999లో పాకిస్థాన్‌తో జరిగిన కార్గిల్‌ యుద్ధంలో పాల్గొని కుడి కాలును కోల్పోయిన యోధుడు మేజర్‌ నవదీప్‌ సింగ్:

"దేశ త్రివర్ణ పతాకానికి అండగా ప్రాణాలర్పించేందుకు ప్రతి సైనికుడు సిద్ధంగానే ఉన్నారు. ఒకప్పుడు టెర్రరిస్టయిన నజీర్‌ వానిలాగా ఓ కశ్మీర్‌ యువకుడు ఎందుకు కావాలనుకుంటున్నాడో కూడా ఆలోచించాలి. ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. యుద్ధం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ప్రాణాలే కాదు, అవయవాలు కూడా పోతాయి. ఆ తర్వాత నష్ట పరిహారం కోసం కోర్టుల తలుపులు తట్టాలి.

యుద్ధంలో సైనికుడు చనిపోవాలని మనం కోరుకుంటాం. ఆ తర్వాత ఆ సైనికుడి వితంతు భార్య పింఛను కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. యుద్ధంలో కొన్నిసార్లు మృతదేహం ఆనవాళ్లు కూడా దొరకవు. పింఛను కావాలంటే భర్త మతదేహాన్ని తీసుకరావాలని అధికార యంత్రాంగం ఆదేశిస్తుంది. యుద్ధంలో గాయపడితే అంగవైకల్య నష్టపరిహార పింఛను కోసం ఏళ్లకు ఏళ్లు కోర్టుల చుట్టూ తిరగాలి. యుద్ధంలో కాలు కోల్పోయిన నేను పింఛను కోసం ఏడేళ్లు కోర్టుల చుట్టూ తిరిగాను. సైనిక పింఛను విషయంలో కేంద్ర ప్రభుత్వం అప్పీళ్లను ఉపసంహరించుకోవాల్సిందిగా సుప్రీం కోర్టు స్వయంగా ఆదేశించినప్పటికీ ఇప్పటికీ వెయ్యి కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రాణాలతో పరాచకాలొద్దు. అన్యాయంగా సైనికుల ప్రాణాలను బలిపెట్టవద్దు. భారత సైన్యానికి ఎప్పుడు ఎలా స్పందించాలో తెలుసు. ఎం చేయాలో వారికి మనం సూచించాల్సిన అవసరం లేదు. సముచిత సమయంలో సముచిత చర్య తీసుకోవడం వారికి తెలుసు. ముందుగా పాకిస్థాన్‌ను టెర్రరిస్టు దేశంగా ప్రపంచం ప్రకంటించేలా దౌత్యపరమైన ఒత్తిడి తీసుకరావాలి. భావ ప్రకటన స్వేచ్ఛ ఉందిగదా అంటూ ఆవేశంతో మాట్లాడడం సముచితం కాదు"

అవును. చచ్చేది మనం కాదుకదా.... ఎన్ని యుద్దాలైనా కోరుకుంటాం.....

No comments:

Post a Comment