Tuesday, January 8, 2019

బాబోయ్....! ఈళ్ళేశాలూ...

సాపేక్ష సిద్ధాంతం.. e=mc^2.. కాంతి విద్యుత్తు ప్రభావం.. ఇలా ఎన్నో ప్రతిపాదనలకు, ఆవిష్కరణలకు మూల పురుషుడు ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌. ఓ విధంగా చెప్పుకోవాలంటే ఆయన వల్లే భౌతిక శాస్త్రం కొత్త పుంతలు తొక్కింది. కానీ, ఆయన సిద్ధాంతాలు తప్పుల తడకగా ఉన్నాయని అంటున్నారు కొందరు భారత శాస్త్రవేత్తలు. ఇక, న్యూటన్‌ కూడా గురుత్వ వికర్షణ శక్తులను అర్థం చేసుకోవడంలో దారుణంగా విఫలమయ్యాడని వాదిస్తున్నారు. 106వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ వేదికగా పలువురు భారత శాస్త్రవేత్తలు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి. దక్షిణ భారత్‌కు చెందిన ఓ వర్సిటీ అధ్యాపకుడు మూలకణ పరిశోధనను వేల ఏళ్ల క్రితమే ప్రాచీన హిందువులు కనుగొన్నారని, పరిశోధనలు చేశారని చెబుతూ అందుకు ఓ హిందూ గ్రంథాన్ని రుజువుగా పేర్కొన్నారు.
 
ఆంధ్రా వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ జీ.నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ రామాయణంలో 24 రకాల విమానాల తయారీ పద్ధతులు ఉన్నాయని, దానికి సంబంధించిన నెట్‌వర్క్‌ ల్యాండింగ్‌ స్ర్టిప్స్‌ శ్రీలంకలో ఉన్నాయని చెప్పారు. తమిళనాడుకు చెందిన ఓ వర్సిటీ అధ్యాపకుడు డాక్టర్‌ కేజే కృష్ణన్‌ మాట్లాడుతూ న్యూటన్‌, ఐన్‌స్టీన్‌ ఇద్దరి సిద్ధాంతాలూ తప్పేనని, గురుత్వాకర్షణ తరంగాలకు నరేంద్ర మోదీ తరంగాలు అని పేరు పెట్టాలని అన్నారు. ఐన్‌స్టీన్‌ సిద్ధాంతాలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయని, న్యూటన్‌ గరుత్వ వికర్షణ శక్తులను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాడని తెలిపారు. కాగా, ఈ శాస్త్రవేత్తల అభిప్రాయాలపై భారత సైంటిఫిక్‌ కాంగ్రెస్‌ అసోసియేషన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆ వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమని, వాటి నుంచి తాము దూరంగా ఉంటున్నట్లు పేర్కొంది.


3 comments:

  1. http://mattimasaanam.blogspot.com/2019/01/blog-post.html?m=1

    ReplyDelete
  2. Ha ha ha, I don't understand how they became doctors n scientists

    ReplyDelete