Tuesday, January 29, 2019

"ఈ మధ్యనే చిరంజీవి వై అనే బ్లాగరు గోభక్షణ గురించి రాసిన పోష్టులో......"

హరిబాబు ఈమధ్యే రాసిన ఒక ఇంటెరెస్టింగ్ పోష్టు... ఇంకా ఇంటెరెష్టుతో చదువుతుంటే... మధ్యలో ఈ కింది మాట తగిలింది..

"ఈ మధ్యనే చిరంజీవి వై అనే బ్లాగరు  గోభక్షణ గురించి రాసిన పోష్టులో సూక్తం సంఖ్య గానీ మంత్రం సంఖ్య గానీ ఇవ్వకుండా జాగ్రత్త పడినట్టు వీళ్ళు ఎంతో పరిశోధించి రాసిన చారిత్రక గ్రంధం అని చెప్పే ఏ పుస్తకంలోనూ అధికారికమైన శాసనాలను గానీ ప్రాంతాల ఆనవాళ్ళను గానీ గానీ వ్యక్తుల వంశావళిని గానీ చూపించరు."

కుక్క తోక వంకర లాగా... దాన్ని బంగారు కుర్చీలో కూర్చోపెట్టినా,  కాలెత్తే.. ఉచ్చ పోసిద్దన్న చందంగా.. హరిబాబు పోష్టులు సాగిపోతుంటాయి.. 

వేదాల్లో గో భక్షణ తప్పనిసరిచేశారు అని ఎంతోమంది అన్నాగానీ, పురుషం..శూక్తం.. దేవత.. మట్టీ.. మశాణం.. అంటూ టాపిక్కు డైవర్టు చెయ్యడంలో ఈ బచ్చాలు వేదకాలం నుంచీ.. మోడీ కాలందాకా.. అదే టెక్నిక్కు.

"ఉచ్చారణ మార్చకుండా.. జస్ట్ దేవత పేరు మారిస్తే.. అర్ధం ఎలా మారిపోతుందో చెప్పు" అనగానే..  వేదాలని.. నమిలి మింగేశా అని చెప్పుకున్న ఒక బ్రాహ్మణ ప్రొఫెసరు.. అక్కడినుంచి జంపు..

తమ చెప్పు చేతల్లో ఉండాల్సిన వీళ్ళంతా.. తమ సొంత సొంత జ్ఞానంతో పైకొచ్చినందుకు.. హరిబాబులాంటివాళ్ళకు అక్కస్సు.. అంతేగానీ.. వారి మతం మీద వారికి ప్రేమా లేదూ.. తోటకూర కట్టా లేదు..

రాజులు ఈ ఎధవల్ని పోషించినంతకాలం.. వీల్లకి మామూలు జనాలతో పనిలేదు కాబట్టే.. వాళ్ళని గుల్లోనికి రానివ్వలేదు. ఎప్పుడైతే..  రాజులు పోయి.. పోషిచ్చే దిక్కు లేకుండా పోయిందో.. అప్పుడు అందర్నీ లోపలికి పిలిచి హుండీల్లో డబ్బులేపిచ్చుకోని.... దానికి హిందూమత సంస్కరణ అని పేరెట్టుకున్నారు. అంతేగానీ.. వీళ్ళకి హిందూ మతం మీద ప్రేమా లేదూ.. తోటకూర కట్టా లేదూ..


వాల్ల ప్రభుత్వ పాలనలో ఉన్న.. శనిదేవుడి గుల్లోకి ఆడవాల్లని పంపినప్పుడు.. ఒక్క ముండాకొడుకుకి కూడా వాళ్ళ మతం బ్రష్టుపడుతందనే ఆలోచనలేదుగానీ, కమ్యూనిష్టు పాలనలో ఉన్న అయ్యప్ప దగ్గరకి ఆడవాళ్ళు వెలతాము అంటే మాత్రం.. మర్డర్లు.. అల్లర్లూ.. వెలతాం అన్నవాళ్ళకి రక్షణ కల్పించిన ఆ ప్రభుత్వంపై మాత్రం విమర్శలు.  ఏకాడకీ పాకిస్థాన్ టెర్రరిష్టులకంటే.. ఎక్కువ అరాచకం చెయ్యాలనే తపన తప్ప  వీల్లకి తమ మతం మీద ప్రేమాలేదూ.. తోటకూర కట్టా లేదు..


వేదాల్లో గో భక్షణ రిఫరెన్సులు నెక్ష్ట్ పోష్టులో ఇస్తాను.. హరిబాబుకేగానీ.. చీమూ.. నెత్తురు.. సిగ్గు.. శరం.. అనేది ఏకోశానా ఉన్నాగానీ.. తన మతం వొదులుకోవాలి..  ఈ చాలెంజికి రెడీనా??





Saturday, January 12, 2019

ప్రార్ధన, నూనెలతో రోగాలు మాఫీ అనే పాస్టర్లూ...! దుకాణం సర్దేస్తారా?

కీళ్లనొప్పులు వేధిస్తున్నా.. నమ్మిన దైవం యేసుక్రీస్తు తన బాధలు తొలగిస్తాడని విశ్వసించింది. 20ఏళ్లుగా చికిత్స తీసుకోకుండా జీస్‌సపైనే భారంవేసి కాలం వెళ్లదీస్తోంది. వ్యాధి ముదరడంతో ఆస్పత్రికి తీసుకెళ్లినా చికిత్సకు సహకరించలేదు. దేవుని పట్ల ఆమె పెంచుకున్న ప్రగాఢమైన నమ్మకాన్ని గుర్తించిన డాక్టర్‌ తానే జీస్‌స అనిచెప్పి చికిత్స అందిస్తున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం కొత్తపాడుకు చెందిన పుల్లగూర మరియమ్మ(55) క్రీస్తుని నమ్మి నిత్యం ప్రార్థనా మందిరానికి వెళుతుంది. ఆమె 20ఏళ్లుగా కీళ్లవాతంతో బాధపడుతోంది. వ్యాధి తీవ్రతతో మోకాళ్లు, మోచేతులు బిగుసుకుపోవడంతో.. భర్త బాలశౌరి ఆమెను జీజీహెచ్‌కు తరలించారు. అక్కడా ఆమె చికిత్సకు నిరాకరించింది. విషయం తెలుసుకున్న న్యూరాలజీ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ గాజుల రామకృష్ణ ఆమె వద్దకెళ్లి ‘మరియమ్మా లే.. నేను నీ యేసును వచ్చాను! నీ భక్తికి మెచ్చి ఈ డాక్టర్‌ రూపంలో చికిత్స చేసేందుకు వచ్చాను. బుద్ధిగా మందులు వేసుకో..’ అంటూ ఆమె చెవిలో చెప్పారు. ఇంకేముంది.. తనకోసం ఏకంగా జీసస్‌ వచ్చాడని భావించిన బాధితురాలు చక్కగా చికిత్సకు సహకరిస్తోంది. కాగా, న్యూరాలజీ విభాగాధిపతి ఎన్వీ సుందరాచారి నేతృత్వంలో రామకృష్ణ, పీజీ విద్యార్థిని మైత్రి ఆమెకు పరీక్షలు చేయించి కీళ్లవాతం తీవ్రస్థాయిలో ఉందని నిర్ధారించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ‘మరియమ్మకు కీళ్లు, ఎముకలు బిగుసుకుపోవడంతో ఆపరేషన్‌ చేసి కదలికలు తేలికచేసేందుకు ఆర్థోపెడిక్‌ వార్డుకు తరలిస్తాం’ అని రామకృష్ణ తెలిపారు.

Tuesday, January 8, 2019

నీకు కళ్ళజోడెందుకొస్తుందో.... చెప్పేసిన చాగంటి.




బాబోయ్....! ఈళ్ళేశాలూ...

సాపేక్ష సిద్ధాంతం.. e=mc^2.. కాంతి విద్యుత్తు ప్రభావం.. ఇలా ఎన్నో ప్రతిపాదనలకు, ఆవిష్కరణలకు మూల పురుషుడు ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌. ఓ విధంగా చెప్పుకోవాలంటే ఆయన వల్లే భౌతిక శాస్త్రం కొత్త పుంతలు తొక్కింది. కానీ, ఆయన సిద్ధాంతాలు తప్పుల తడకగా ఉన్నాయని అంటున్నారు కొందరు భారత శాస్త్రవేత్తలు. ఇక, న్యూటన్‌ కూడా గురుత్వ వికర్షణ శక్తులను అర్థం చేసుకోవడంలో దారుణంగా విఫలమయ్యాడని వాదిస్తున్నారు. 106వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ వేదికగా పలువురు భారత శాస్త్రవేత్తలు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి. దక్షిణ భారత్‌కు చెందిన ఓ వర్సిటీ అధ్యాపకుడు మూలకణ పరిశోధనను వేల ఏళ్ల క్రితమే ప్రాచీన హిందువులు కనుగొన్నారని, పరిశోధనలు చేశారని చెబుతూ అందుకు ఓ హిందూ గ్రంథాన్ని రుజువుగా పేర్కొన్నారు.
 
ఆంధ్రా వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ జీ.నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ రామాయణంలో 24 రకాల విమానాల తయారీ పద్ధతులు ఉన్నాయని, దానికి సంబంధించిన నెట్‌వర్క్‌ ల్యాండింగ్‌ స్ర్టిప్స్‌ శ్రీలంకలో ఉన్నాయని చెప్పారు. తమిళనాడుకు చెందిన ఓ వర్సిటీ అధ్యాపకుడు డాక్టర్‌ కేజే కృష్ణన్‌ మాట్లాడుతూ న్యూటన్‌, ఐన్‌స్టీన్‌ ఇద్దరి సిద్ధాంతాలూ తప్పేనని, గురుత్వాకర్షణ తరంగాలకు నరేంద్ర మోదీ తరంగాలు అని పేరు పెట్టాలని అన్నారు. ఐన్‌స్టీన్‌ సిద్ధాంతాలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయని, న్యూటన్‌ గరుత్వ వికర్షణ శక్తులను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాడని తెలిపారు. కాగా, ఈ శాస్త్రవేత్తల అభిప్రాయాలపై భారత సైంటిఫిక్‌ కాంగ్రెస్‌ అసోసియేషన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆ వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమని, వాటి నుంచి తాము దూరంగా ఉంటున్నట్లు పేర్కొంది.