Monday, December 17, 2018

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ చెప్పిన చెప్పిన "రాముడు సీతనెందుకు వదిలేశాడు?"

రాముడు సీతమ్మ తల్లిని రాజు కాకముందు పెళ్ళి చేసుకున్నాడు. అప్పడి రాముడు రాజకుమారుడు అంతే. యుద్ధం తరువాత సీత అగ్నిపునీత అని లోకానికి చాటి పట్టాభిషేకం చేసుకున్నాడు. ఒకనాడు మంత్రులలో ప్రభువుకు నీతి పాఠం చెప్పే మంత్రి వచ్చి రాముడు ఏకాంతలో ఉండగా,

“ప్రభూ! మీరు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు. లోకానికి ధర్మం నేర్పడానికి రామచంద్రమూర్తిగా వచ్చి నరుడిగా ఈ భూమిపై నడుస్తున్నారు. ఇటువంటి మీరు ప్రభువు కాకముందు సీతమ్మనుభార్యగా ఉంచుకున్నారు. ధర్మానికి తప్పులేదు. ప్రభువయ్యాక సీతమ్మ భార్యగా ఉండవచ్చా?” అని అడిగారు.

“ఎందుకుండకూడదు?” అని అడిగారు రాములవారు. అందుకు మంత్రి, “ప్రభువు భూమిపతి. అంటే ఈ భూమికి భర్త. మరి అప్పుడు భూమాత తనయ సీతమ్మ మీకు ఏమవుతుంది? మీరు రాజారాముడయ్యాక మీరు ఏకపత్నీవ్రతుడు కాబట్టి భూమికి మాత్రమే భర్తగా ఉండాలి. మరి ఇప్పుడు ధర్మం నిలిచిందా?” అని అడిగాడు. ఉలిక్కిపడిన రాముడు, కారణం చెప్తూ ధర్మం కోసమే సీతమ్మను అడవికి పంపించాడు.


Taken from:

http://smarana-bharathi.blogspot.com/2018/07/blog-post_2.html?showComment=1544978679540#c3610222458266036807

11 comments:

  1. చాగంటి కోటేశ్వరరావు గారు క్రొత్త రామాయణం చెప్తున్నారా ? ఈ విషయం ఎక్కడ వ్రాసి ఉంది ?
    భూ మాత అంటారు కానీ భూపతి అని ఎవరన్నా అంటారా ?

    ReplyDelete
    Replies
    1. నేను ఇక్కడ చదివాను..

      http://smarana-bharathi.blogspot.com/2018/07/blog-post_2.html?showComment=1544978679540#c3610222458266036807

      Delete
    2. నీహారిక గారూ, భూపతి అన్నమాట ప్రసిధ్ధమే నండీ. భూపతి అంటే రాజు అని అర్థం. నా విష్ణుః పృధివీపతిః అని శాస్త్రం. అంటే రాజు ఐన వాడిలో ఎంతో కొంత విష్ణ్వంశ ఉంటుందన్నమాట. భూదేవి విష్ణువు భార్య కాబట్టి రాజైనవాడి యొక్క విష్ణ్వంశను పురస్కరించుకొని రాజును భూపతిగా సంబోధించటం వ్యవహారంలో ప్రసిధ్ధంగా ఉంది. భూపతి అన్న అర్థం ఇచ్చే భూకాంతుడు, భూనాథుడు, భూమీశుడు వగైరా పేర్లు కూడా అలాంటివేను.

      Delete
    3. Exctly!! దశరధుడి అనంతంతరం భూమికి కలిగిన వైధవ్యాన్ని రాముడు తొలగించాడట (భూపతి అవ్వడం ద్వారా). రంగనాయకమ్మ ఈ నేపధ్యంలోనే అడిగింది. వైధవ్యం కలిగింది కేవలంభూమికేనా? దశరధుడి మరణం వల్ల వైధవ్యం పొందిన మూదొందల చిల్లర భార్యలక్కూడా రాముడు వైధవ్యాన్ని తొలగించవచ్చా అని.

      @ నీహారిక: తొందరేమీలేదు. మీరు కనీసం చాగంటి గాడి ప్రవచనాలైనా విని రామాయణం అప్పుడుకూడా మీకు రామాయణం నచ్చితేనే మీరు చర్చలో పాల్గొంటూ ఉండండి. I enjoy blasting fanatics. Not fools.

      Delete
  2. అబద్దాలు చెప్పడంలో గ్లోబెల్ కూడా చాగంటి ముందు దిగదుడుపు. అతను మోడీకి హార్డ్కొర్ ఫాన్. మోడీ పిఎం ఐనప్పుడు.. ఒక ప్రవచన కార్యక్రమంలో దెయ్యం పట్టీనవాడికి మల్లే ఊగిపోతూ.. "మోడీని దేవుడు హిందువులకోసంపంపించాడు".. అంటూ ఆయాసపడిపొయ్యాడు..భార్యని ఒదిలేసిన మోడీని కవర్ చెయ్యడానికే ఈ పిట్టకథ సృష్టించి ఉంటాడు.

    ReplyDelete
  3. చాగంటి నమ్మదగినవాడు కాదు. అతను ఒక ధార్మిక వ్యభిచారి. గోదావరి పుష్కరాలు గుర్తున్నాయా? శంకరాభరణం ప్రవచనాలు గుర్తున్నాయా? ఇతను కేవలం తనను తాను మార్కెట్ చేసుకుంటున్నాడు. మన సినిమాలు, మీడియా అతగాణ్ణి హైలైట్ చేస్తుంది.

    ReplyDelete
  4. రామాయణం లో ఈ కథ ఎక్కడా వినలేదే

    ReplyDelete
    Replies
    1. ఇప్పటినుంచి ఉంటుందిలేండి.. పిట్టకథల సమూహారమే.. మన గ్రంధాలన్నీ..

      Delete
    2. ఒక్క హిందూ మతమనే కాదు. ఏ మత గ్రంధమైనా ఇలాగే పెంటతో నిండి ఉంటుంది. ఆయా మతాల్ని మనం అనుసరించినప్పుడు ఆ పెంట మన బుర్రల్లో పేరుకుపోతుంది. యేసు కన్యకు పుట్టినట్లు బైబిలో లేదా? మహమ్మద్ నింగికెగిరినట్లు (బరఖ్ మీద) ముస్లింల గ్రంధాల్లో లేదా?

      Delete
    3. మతం మనిషిని చాతకానివాడినైనా చేస్తుంది. లేదా వాడి చేతిలో ఆయుధాన్ని పెడుతుంది..

      Delete
  5. ఏ రాజైనా ఎధవపని చేసినప్పుడు.. "పూర్వజన్మలో అలా ఐందీ.. ఈ జన్మలో ముని శాపం వల్ల అలా చెయ్యాల్సొచ్చిందీ" అంటూ పిట్టకథలు అల్లెయ్యడం, వాటితోఉద్గ్రంధాలు, పురాణాలు సృష్టించెయ్యడం.. ఒక సొమరి సైకో జాతికి.. వెన్నతో పెట్టిన విధ్య.. మరి ఊరికే పోషిత్తారేంటీ రాజులూ..

    ReplyDelete