Monday, December 17, 2018

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ చెప్పిన చెప్పిన "రాముడు సీతనెందుకు వదిలేశాడు?"

రాముడు సీతమ్మ తల్లిని రాజు కాకముందు పెళ్ళి చేసుకున్నాడు. అప్పడి రాముడు రాజకుమారుడు అంతే. యుద్ధం తరువాత సీత అగ్నిపునీత అని లోకానికి చాటి పట్టాభిషేకం చేసుకున్నాడు. ఒకనాడు మంత్రులలో ప్రభువుకు నీతి పాఠం చెప్పే మంత్రి వచ్చి రాముడు ఏకాంతలో ఉండగా,

“ప్రభూ! మీరు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు. లోకానికి ధర్మం నేర్పడానికి రామచంద్రమూర్తిగా వచ్చి నరుడిగా ఈ భూమిపై నడుస్తున్నారు. ఇటువంటి మీరు ప్రభువు కాకముందు సీతమ్మనుభార్యగా ఉంచుకున్నారు. ధర్మానికి తప్పులేదు. ప్రభువయ్యాక సీతమ్మ భార్యగా ఉండవచ్చా?” అని అడిగారు.

“ఎందుకుండకూడదు?” అని అడిగారు రాములవారు. అందుకు మంత్రి, “ప్రభువు భూమిపతి. అంటే ఈ భూమికి భర్త. మరి అప్పుడు భూమాత తనయ సీతమ్మ మీకు ఏమవుతుంది? మీరు రాజారాముడయ్యాక మీరు ఏకపత్నీవ్రతుడు కాబట్టి భూమికి మాత్రమే భర్తగా ఉండాలి. మరి ఇప్పుడు ధర్మం నిలిచిందా?” అని అడిగాడు. ఉలిక్కిపడిన రాముడు, కారణం చెప్తూ ధర్మం కోసమే సీతమ్మను అడవికి పంపించాడు.


Taken from:

http://smarana-bharathi.blogspot.com/2018/07/blog-post_2.html?showComment=1544978679540#c3610222458266036807

Saturday, December 15, 2018

Friday, December 14, 2018

వేదాలు గోవును తినమని చెప్పాయా? చెబితే సైకోల తదుపరి ఆయుధమేంటి? PART - 1

"బ్రహ్మ తినదిగిన జీవుల్ని సృష్టించాడు. వాటిని తినేవాటిని సృష్టించాడు. కాబట్టి మాంసం తినడం తప్పుకాదు"- మనుస్మృతి

"సున్నితంగా.. ఎంతో రుచిగా ఉన్న ఆవు మాంసాన్ని తినడానికి నేను ఇష్టపడతాను" - సతపతబ్రహ్మణ

"కుమార్తె పెళ్ళికి ఆవుల్ని, ఎద్దుల్ని బలి ఇవ్వాలి"- ఋగ్వేదం

"పూజా.. పురస్కారాలు చక్కగా నిర్వహించే ప్రతి ఒక్కడూ.. మాంసం తిని తీరాలి. లేదంటే అతడు చనిపోయాక, బలి అవ్వబోయే జంతువుగా పుడతాడు". - మనుస్మృతి

"ఇంద్రుడు.. ఆవుల, దూడల మరియు గుఱ్ఱాల మాంసాన్ని ప్రీతిగా తింటాడు" - ఋగ్వేదం

"శ్రాద్దకర్మలలో మరియు ఇంట్ళో పెళ్ళి జరిగినప్పుడు.. ఆవుని కోసుకోవాలి" - అపస్తంబ గృహస్తూత్రం

"శ్రాద్దఖర్మలకు వచ్చిన బ్రాహ్మణుడు.. మాంసం తినకపోతే.. అతడు నరకానికి పోతాడు" - వశిష్ట ధర్మసూత్ర

"ఆవుతిన్నవాడే నిజమైన హిందువు అని మనపురాణాలు చెప్పాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు" - స్వ్వామీ వివేకానంద

"మొదట్లో.. ఆవుని తినని బ్రాహణుడు.. బ్రాహ్మణుడే కాదు.. అనేవారు" స్వామి

"రంతిదేవుడు రోజుకు 2 వేల ఆవుల్ని.. మరి 2 వేల ఇతర జీవుల్ని చంపి దానం చేసేవాడు" - మహాభారతం

TO BE CONTINUED..